దారితప్పి ఊళ్లోకి వచ్చిన ఎలుగు.. చిత్రహింసలు పెట్టిన గ్రామస్తులు (వీడియో)

69చూసినవారు
దారి తప్పి ఊరిలోకి ప్రవేశించిన ఒక ఎలుగుబంటిపై కొందరు గ్రామస్థులు కర్కశంగా ప్రవర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఒక గ్రామంలోకి వచ్చిన ఎలుగును కొందరు గ్రామస్థులు బంధించారు. దాని నోరు విరిచి.. కాలి గోళ్లు తొలగించారు. ఆ మూగ జీవి నొప్పితో విలవిలలాడుతున్నా కనికరించలేదు. ఆ వీడియో SMలో వైరల్ అవుతోంది. స్పందించిన అటవీ అధికారులు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. ఆచూకీ గుర్తించిన వారికి రూ.10 వేలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్