జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో శనివారం ఓ బస్సు రోడ్డుపై నుంచి జారి 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ఓ ప్రైవేట్ మినీ బస్సు భలేసా నుంచి థాత్రికి వెళ్తుండగా భాటియాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతులను బషీరా బేగం (50), సలీమా బేగం (55), బస్సు డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్ (25)గా గుర్తించారు. వీరిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.