వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నర్సంపేట మండలం మాధన్న పేట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఇరుక్కుపోయి విష్ణు అనే వ్యక్తి మృతి చెందగా ప్రేమ్ చంద్ అనే మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుడు నర్సింహులపేట వాసిగా గుర్తించారు.