ప్రస్తుతం సోషల్ మీడియాలో బంగ్లాదేశ్‌లోని మెహెర్‌పూర్ నుండి వెలుగులోకి ఓ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కోతి స్వయంగా చికిత్స కోసం ఒక మెడికల్ షాపుకే వచ్చి, అక్కడ ఉన్న వ్యక్తికి తాను ఎక్కడ గాయపడ్డానో చెప్పడం ప్రారంభించింది. ఆ కోతికి సహాయం చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. వారిలో ఒక వ్యక్తి ఆ కోతి గాయానికి కట్టు కట్టాడు. ఇదంతా కొందరు తమ సెల్‌ఫోన్ల ద్వారా వీడియో తీశారు.