నిజామాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్న తల్లినే కూతురు హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని నాగారంలో భార్యాభర్తలు అయిన సౌందర్య, రమేష్ నివాసం ఉంటున్నారు. తన కుటుంబ వ్యవహారాల్లో తల్లి విజయ తరచూ జోక్యం చేసుకోవడంతో సహించలేకపోయిన కూతురు భర్తతో కలిసి తల్లిని గొంతు నులిమి చంపేసింది. అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో హత్య అని తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు.