సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఆదిమూలం భీమాస్ ప్యారడైజ్ లో తనను పలుమార్లు బెదిరించి, లైంగిక దాడికి పాలపడ్డాడని అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా నేత ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేసింది.