తెలంగాణ ఉన్నత విద్యామండలి 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఎప్‌సెట్ పరీక్షలను ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5వ తేదీల్లో నిర్వహించనున్నారు.