మలయాళ సినీ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కోజికోడ్‌కు చెందిన 31 ఏళ్ల ఓ కళాకారుడు ఈశాన్య డివిజన్లోని బీఐఏఎల్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2012లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నటుడు మమ్ముట్టిని కలిసేందుకు కేరళలోని ఈస్ట్ హిల్‌కు వెళ్లినప్పుడు రంజిత్‌ను కలిశారని సదరు వ్యక్తి తెలిపాడు. ఈ క్రమంలో తనకు మద్యం పోసి, బట్టలు విప్పి లైంగికంగా వేధించాడని ఆరోపించాడు.