ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాయితీ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లబ్ధిదారులకు ఒక సిలిండర్ రాయితీ మొత్తం రూ. 895 కోట్ల విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 31న ఉచిత సిలిండర్ను లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మూడు ఉచిత సిలిండర్లకు రూ. 2,684 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.