నడి రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా ప్రియురాలి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రియుడు రెచ్చిపోయాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని చితకబాదాడు. అక్కడ ఉన్న వారంతా వీడియోలు తీయడం తప్ప అతడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు.