కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం

50చూసినవారు
రైతులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వరి, రాగులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి 14 పంటలు ఉన్నాయని తెలిపారు. వరి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.117 పెంచామని, దీంతో వరి ధర క్వింటాలుకు రూ.2,300కు చేరిందని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్