హైదరాబాద్ కేపీహెచ్‌బీకి చెందిన ఓ వైద్యుడి (50) నుంచి ఒకరోజు రూ.23.56 లక్షలు.. మర్నాడే రూ.3 లక్షలు.. తర్వాతి రోజు రెండు విడతలుగా రూ.68 లక్షలు.. ఆ మర్నాడు రూ.17.10 లక్షలు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 63 విడతల్లో డబ్బులను సైబర్ ముఠా కొట్టేసింది. మే 21 నుంచి ఈ నెల 8 వరకు మొత్తం రూ.8,60,38,022 కాజేసింది. తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల చరిత్రలో ఇదే అతిపెద్ద ఆన్‌లైన్ మోసమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) వెల్లడించింది.