మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తూనే ఉంది. బస్సుల్లో కుట్లు, అల్లికలు తాము వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్స్‌లు వేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటాగా నోటీసులు జారీ చేసింది. అయితే ఊరూరా కేటీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. ఒకే సమయంలో ఇటు హరీశ్, అటు కేటీఆర్‌ను కార్నర్ చేస్తూ రాజకీయాన్ని రక్తికట్టిస్తోంది కాంగ్రెస్.