నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు, స్పృహ కోల్పోయిన డ్రైవర్

55చూసినవారు
నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపై వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణంలో మంటలు కారు మొత్తం వ్యాపించాయి. కారులో ఉన్న డ్రైవర్ మంటలను గమనించి.. కారును పక్కకు ఆపి దట్టమైన పొగకు స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అద్దాలు పగలకొట్టి డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్