కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

78చూసినవారు
కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
రన్నింగ్ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. గుర్రంగూడా మెయిన్ రోడ్డులో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో పొగలు రావడం గమనించిన డ్రైవర్.. కారు నుంచి కిందకు దిగాడు. దీంతో ప్రమాదం తప్పింది. మంటల దాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. కారు ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్