తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కర్బుజా కొనుక్కోవడానికి రోడ్డు పైకి వెళ్లిన ఐదేళ్ల బాలుడు బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గంగారం- లత దంపతుల చిన్న కుమారుడు మానస్(5) రోడ్డు మీదకు రాగా, జగిత్యాల నుంచి కొత్తపేట వెళుతున్న ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా రావడంతో ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.