మతిమరుపు అనేది అందరిలో ఉండేదే. అయితే కొందరు మాత్రం కొన్ని విషయాలు, పనులను పూర్తిగా మర్చిపోతారు. మెదడులోని కణాలు కొన్ని కారణాల వల్ల నెమ్మదిగా తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్నే అల్జీమర్స్ అంటారు. ఇలాంటి వ్యాధి ఒకటుందని 1901లో గుర్తించారు. అల్జీమర్స్లో ‘ఎర్లీ ఆన్సెట్ అల్జీమర్స్’, ‘లేట్ ఆన్సెట్ అల్జీమర్స్’ అని రెండు రకాలున్నాయి. అల్జీమర్స్ కేసులు 60ఏళ్లు పైబడ్డవాళ్లలోనే ఎక్కువ. కానీ, ఈ మధ్య 30ఏళ్లు దాటిన వాళ్లలో కూడా కనిపిస్తోంది.