కిన్నెరసాని జలశయానికి పోటెత్తిన వరద

60చూసినవారు
కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తింది. కిన్నెరసాని ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి అధకారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 3 గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకి ఇన్ ఫ్లో 45 వేల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 8 గేట్లు ఎత్తి 53 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్