తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

50చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 8 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ మేరకు ఏపీలోని ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గురువారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్