ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు (ఏపీలో అక్టోబర్ 12 వరకు) ప్రస్తుతమున్న ప్రభుత్వ మద్యం దుకాణాలే యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.