ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ రోడ్డుపై వెళ్తున్న వారిని వెంబడించి కరిచిన వ్యక్తిని స్థానికులతో కలిసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ వేయని వీధి కుక్కు అతడిని కరిచిందని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరచించగా, అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.