ఎలుగుబంటి గుహలోకి వెళ్లిన వ్యక్తి.. తృటిలో బయటపడ్డాడు (వీడియో)

71చూసినవారు
సెర్బియాకు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్‌ స్టెఫాన్ జాంకోవిక్‌కు ఇటీవల తృటిలో ప్రమాదం తప్పింది. ఎలుగుబంటి గుహలోకి వెళ్లి స్టెఫాన్ కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఎలుగుబంటి వచ్చింది. అయితే ఎలుగుబంటిని రెచ్చగొట్టకుండా నెమ్మదిగా గుహ నుంచి అతడు బయటకు వచ్చాడు. కాసేపు స్టెఫాన్‌ను అది తడిమినా, అదృష్టవశాత్తూ దాడి చేయలేదు. దీంతో అక్కడి నుంచి స్టెఫాన్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్