బైక్ టైర్ లో చున్నీ చుట్టుకొని వివాహిత మృతి

1032చూసినవారు
బైక్ టైర్ లో చున్నీ చుట్టుకొని వివాహిత మృతి
వనపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. మెడలో వేసుకున్న చున్నీ బైక్ టైరులో చుట్టుకొని వివాహిత మృతి చెందింది. సీసీకుంటకు చెందిన గౌతమి (19)కి 9నెలల క్రితం కొత్తకోటకు చెందిన యాదగిరితో పెళ్లైంది. తల్లిగారి ఇంటి నుంచి సోమవారం రాత్రి భర్తతో కలిసి కొత్తకోటకు బైక్ పై వెళ్తుండగా గౌతమి మెడలో ఉన్న చున్నీ బైక్ చక్రానికి చుట్టుకొని దంపతులు కిందపడ్డారు. గౌతమి తలకు తీవ్ర గాయాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్