రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు హైదరాబాద్ పటాన్‌చెరువులోని జిఎంఆర్ గార్డెన్స్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సమావేశంలో పాల్గొనడానికి తెలంగాణలోని అన్ని గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు బయలుదేరారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. హెల్త్ కార్డులు, తదితర డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు కోరారు.