పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం నిర్వహణ తీరుపై పలువురు ఆటగాళ్లు మండిపడుతున్నారు. క్రీడాకారులకు వడ్డించే ఆహారంలో పురుగులు వచ్చాయని బ్రిటన్ స్విమ్మర్ ఆడమ్ పీటీ ఆరోపించాడు. వసతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అథ్లెట్ కు అవసరమైన స్థాయిలో కేటరింగ్ లేదని అసహనం వ్యక్తం చేశాడు.