వారానికి కనీసం 150 నిమిషాలు మార్నింగ్ వాక్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తోంది. దీంతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపింది. ఉదయం పూట వాకింగ్ చేస్తే మానసిక ఆరోగ్యానికి మంచిదని, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పలు అధ్యయనాలలో తేలింది. దీని వల్ల దాదాపు 150 కేలరీలు బర్న్ అవుతాయి. ఈ లెక్కన మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల్ని పొందడానికి ప్రతి వారం వరుసగా 5 రోజులు నడవాలని నిపుణులు చెబుతున్నారు.