వంట విషయంలో గొడవ.. పిల్లలతో కాలువలో దూకిన తల్లి

50చూసినవారు
వంట విషయంలో గొడవ.. పిల్లలతో కాలువలో దూకిన తల్లి
గుజరాత్‌లోని సోంగాధ్‌లో విషాదం చోటుచేసుకుంది. పవార్ కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. వంట విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన భార్య తన ఇద్దరి కుమార్తెలతో కలిసి సమీపంలోని కాలువలో దూకింది. గమనించిన స్థానికులు కాలువలోకి దూకి గాలించగా.. రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరొకరి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్