AP: జనసేన జన్మస్థలం తెలంగాణ అని కర్మస్థానం ఆంధ్రప్రదేశ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ సభలో వెల్లడించారు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా అని అన్నారు. రుద్రవీణ వాయిస్తా..అని అగ్నిధారలు కురిపిస్తా.. అనే మాటలు నిజం చేశాం అని అన్నారు. దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని.. దేశమంతా మనవైపు చూసేలా వందశాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించామని పవన్ తెలిపారు.