యుద్ధంలో కొత్త శకం: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి

67చూసినవారు
యుద్ధంలో కొత్త శకం: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి
లెబనాన్‌ దాడులపై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ‘‘ఈ యుద్ధంలో కొత్త శకం ప్రారంభమైంది. దీన్ని మనమంతా అలవర్చుకోవాల్సి అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలతో హెజ్‌బొల్లాపై దాడులను ఇజ్రాయెల్‌ మంత్రి పరోక్షంగా అంగీకరించినట్లేనని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని నజీబ్‌ మికాటి ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిచర్యలపై చర్చించారు. తాము యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్