ఆన్‌లైన్ పేమెంట్స్ విభాగంలో చైనా సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అరచేతిని చూపిస్తే చాలు చెల్లింపు పూర్తయ్యే ఈ కొత్త విధానాన్ని ‘పామ్ పేమెంట్స్’ అంటున్నారు. ఇందుకోసం వినియోగదారులు పామ్ పేమెంట్స్ వ్యవస్థలో తన అరచేతిని రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. చైనాలోని అనేక ప్రాంతాల్లో, షాపింగ్ మాల్స్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పరికరాలకు అరచేతిని చూపిస్తే చెల్లింపు పూర్తవుతుంది.