ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తాజాగా 'రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్' పేరుతో ఈ ఫీచర్‌ను కస్టమర్లు కోసం అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు ఈ ఫీచర్ సహాయంతో స్నేహితులకు ఫుడ్ రికమండ్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఫ్రెండ్స్ రికమండ్ చేసిన ఫుడ్ ఐటమ్స్, రెస్టారెంట్ పేర్లు కనిపిస్తాయి. దీంతో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని ఆర్డర్ చేసుకునే వీలు ఉంటుంది.