తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. ఆలయ ఈవో కార్యాలయం సమీపంలో మద్యం బాటిల్ కనిపించాయి. అలాగే మరోవైపు గతంలో మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు దర్శనమివ్వడంతో భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.