AP: ఉపాధి హామీ కూలీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘గోకులం’ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటికి అందించే ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే ఉపాధి కూలీలకు 46 పని దినాలకు గాను అదనంగా రూ.13,371 చెల్లించనుంది. అలాగే గొర్రెల షెడ్లకు 67 పని దినాలకు గాను రూ.20,205 ఖాతాలో జమ చేయనుంది.