సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా టీం అదరగొట్టింది. ఇండోర్‌లో సిక్కింతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఏకంగా 349/5 పరుగులు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. బరోడా టీంలో ఓపెనర్లు శశ్వత్ రావత్ (16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) రన్స్ చేయగా భాను పునియా 51 బంతుల్లో 134 రన్స్ చేశాడు. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 20 ఓవర్లలో 86/7 చేసింది.