క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ రికార్డు సృష్టించింది. తొలిసారి దాని విలువ 1,00,000 డాలర్లు దాటింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి దీని విలువ పెరుగుతోంది. తాజాగా ఎస్‌ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా నియమిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో బిట్‌కాయిన్ విలువ మరింత పెరిగింది.