AP: రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(RGSA) పథకం అమలులో FY24లో 25వ స్థానంలో ఉన్న AP ప్రస్తుతం నాలుగో ప్లేస్ కు చేరినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధాని మోదీ దూరదృష్టి, సీఎం చంద్రబాబు నాయకత్వానికి ఇది నిదర్శనమని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ డెవలప్మెంట్, గిరిజన సంక్షేమానికి RGSA కృషి చేస్తోందని పేర్కొన్నారు. కలిసికట్టుగా గ్రామీణ భారత రూపురేఖలను మారుస్తున్నామన్నారు.