TG: ఇందిరమ్మ ఇళ్లను అసలు లబ్ధిదారులకే ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్లో అర్హులైన లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గం లోని 81 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళ పట్టాలు అందజేశారు.మొదటి విడతలో భాగంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు.