డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడి కొడుకు అరెస్ట్

67చూసినవారు
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడి కొడుకు అరెస్ట్
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్‌ను తిరుమంగళం పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. గతంలో కూడా ఇదే కేసులో 10 మందిని అరెస్టు చేశారు. విచారణలో మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్ కూడా అదే గ్రూపులో ఉన్నాడని తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తుగ్లక్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నటి త్రిష గురించి తప్పుగా మాట్లాడి మన్సూర్ గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్