మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లోకి మరో రెండు చీతాలు అడుగుపెట్టాయి. అంతర్జాతీయ చీతా దినోత్సవం సందర్భంగా అగ్ని, వాయు అనే రెండు మగ చీతాలను నేషనల్ పార్కులోకి బుధవారం విడుదల చేశారు. ఇన్నాళ్లు ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాటిని భద్రతకు సంబంధించిన అన్నిరకాల చర్యలు తీసుకున్న తర్వత అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.