పెర్ఫ్యూమ్ బాటిల్‌తో కొత్త రకం చోరీ (Video)

558చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ దుకాణంలో కూర్చుని ఉండగా.. ఓ యువకుడు వెళ్లి ‘‘రూ.5వేలు ఫోన్ పే చేస్తా.. క్యాష్ కావాలి’’ అని అడుగుతాడు. అందుకు ఆమె రూ.50లు అదనంగా చెల్లించాలంటుంది. దీంతో ఆమె రూ.5 వేల నోట్లను బయటికి తీసి, కౌంట్ చేస్తూండగా.. సదరు వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌తో ఆమె చేతిపై కొంత స్ప్రే చేస్తాడు. ఆ వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత సదరు యువకుడు ఆమె చేతిలోని డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ట్యాగ్స్ :