రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బందీలుగా ఉన్న 180 మంది యుద్ధ ఖైదీలను ఇరుదేశాలు మార్చుకున్నాయి. మంగళవారం ఇరు దేశాల అధికారులు యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలు జరిపారు. అందులో భాగంగా ఉక్రెయిన్ తమ ఆధీనంలోని 90 మంది రష్యా సైనికులను వారి స్వదేశానికి పంపగా.. తమ దగ్గర బందీలుగా ఉన్న 90 మంది యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్ అధికారులకు రష్యా అప్పగించింది.