ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ కల్కి 2898 ఏడీ చిత్రం ఆ అరుదైన ఘనతను సాధించింది. IMDB లో అత్యంత ప్రజాదరణ పొందిన పది చిత్రాలలో నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది కల్కి. చిత్ర యూనిట్ ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని ఎక్స్ లో పోస్ట్ చేసింది. అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.