ఏపీలోని రాజమండ్రి విమానాశ్రయానికి అరుదైన ఘనత దక్కింది. కస్టమర్ సంతృప్తి సర్వేలో ఈ ఎయిర్‌పోర్టు తొలిస్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని 61 విమానాశ్రయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే చేపట్టింది. ఇక ఈ సర్వేలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ఎయిర్‌పోర్టు 2వ స్థానంలో ఉండగా, మధురై విమానాశ్రయాలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.