షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం

81చూసినవారు
షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం
ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ కు అరుదైన గౌరవం దక్కింది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌ జ్యూరీ షారుక్ ను ‘కెరీర్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ‘‘షారుక్‌ లాంటి లివింగ్‌ లెజెండ్‌ను ఆహ్వానించాలనే కల నెరవేరింది. ఆయన హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు’’ అని కొనియాడింది. ఈ పోస్ట్‌పై షారుక్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్