క్రికెట్‌ చరిత్రలో సంచలన రికార్డు నమోదు

57చూసినవారు
క్రికెట్‌ చరిత్రలో సంచలన రికార్డు నమోదు
ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండోనేషియా ప్లేయర్ రోహ్మాలియా చరిత్ర సృష్టించారు. 17 ఏళ్ల ఆమె 3.2 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 7 వికెట్లు తీశారు. ఆమె ధాటికి మంగోలియా 24 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌‌లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్