భారత్‌తో విభేదాల వేళ కెనడా కోర్టు సంచలన తీర్పు

80చూసినవారు
భారత్‌తో విభేదాల వేళ కెనడా కోర్టు సంచలన తీర్పు
తమను నోఫ్లై జాబితా నుంచి తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు తిరస్కరించింది. ఉగ్రవాద చర్యకు పాల్పడే అవకాశాలున్నాయని వ్యాఖ్యానిస్తూ వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. కొన్నేళ్ల నుంచి పాకిస్థాన్‌ మద్దతున్న ఖలిస్థానీ ఉగ్రవాదులు పర్వాకర్‌‌సింగ్ దులై, భగత్ సింగ్ బ్రార్ నో ఫ్లై జాబితాలో ఉన్నారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లగా ఇలా తీర్పు చెప్పింది.

సంబంధిత పోస్ట్