యువ‌తిపై హత్యాచారం ఘటనపై సీఎం సీరియ‌స్

63చూసినవారు
AP: బాపట్ల జిల్లాలో యువ‌తిపై హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియ‌స్ అయ్యారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని, బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి అనిత‌ను ఆదేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ రోజు ఉద‌యం చీరాల మండ‌లం ఈపురుపాలెంలోని రైలు ప‌ట్టాల వ‌ద్ద యువ‌తి మృత‌దేహం క‌నిపించింది. అత్యాచారం, హత్యగా పోలీసులు కేసు న‌మోదు చేశారు.

సంబంధిత పోస్ట్