కొన్ని గంటల్లో తుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండం

18850చూసినవారు
కొన్ని గంటల్లో తుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్ (రెమాల్)గా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది. రేపు ఉదయం ఇది తీవ్ర తుఫాన్ గా మారి అర్ధరాత్రికి బెంగాల్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేసింది. ఒకవేళ తీరం దాటితే గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఫలితంగా బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

సంబంధిత పోస్ట్