ఏసీ నుంచి క్లాస్ రూమ్‌లోకి వచ్చిన పాము (వీడియో)

69చూసినవారు
నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో షాకింగ్ సంఘటన జరిగింది. అక్కడ ఓ క్లాస్ రూమ్‌లో ఉన్న ఏసీ నుంచి ఓ పాము తరగతి గదిలోకి ప్రవేశించింది. దీంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ అధ్యాపకుడు బోధిస్తుండగా ఏసీ నుంచి పాము రావడాన్ని విద్యార్థులు గమనించారు. వెంటనే గదిని ఖాళీ చేసి క్యాంపస్ సెక్యూరిటీని సంప్రదించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్