చంద్రుడి చుట్టూ ఓ వింత వస్తువు తిరుగుతోందని నాసా ఇటీవల గుర్తించింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మాదిరిగా ఉందని వెల్లడించింది. అయితే అది దక్షిణ కొరియాకు చెందిన లూనార్ ఆర్బిటర్ ‘దనురి’ అని తేలింది. 2022 నుంచి ఇది చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది.